మైనార్టీ ఆశ్రమ పాఠశాలను సందర్శించిన గౌస్ హైదర్

మైనార్టీ ఆశ్రమ పాఠశాలను సందర్శించిన గౌస్ హైదర్

HNK: జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాలలను రాష్ట్ర అధికారి కె ఏ గౌస్‌హైదర్ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. గురుకుల పాఠశాలల పరిసర ప్రాంతాలను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.