VIDEO: పూతలపట్టులో శ్వేత నాగు కలకలం
CTR: పూతలపట్టు మండలంలో శ్వేతనాగు ప్రతక్షమైంది. రంగంపేట క్రాస్ రోడ్డులోని HP పెట్రోల్ బంక్ సమీపంలో రాత్రి 7గంటల సమయంలో నడి రోడ్డుపై దర్శనమిచ్చింది. పడగ విప్పి సుమారు అర గంట అలాగే ఉండిపోయింది. జనాల అలజడి, వాహన శబ్దాలకు సైతం బెదరలేదు. చివరకు స్నేక్ క్యాచర్ వచ్చి పామును పట్టుకుని అడవిలో వదిలి పెట్టారు.