'పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి'
MNCL: ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు, ఐదు డీఏలు వెంటనే మంజూరు చేయాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి కోరారు. మంచిర్యాలలో ఆదివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నూతన పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని అన్నారు. జిల్లాలోని ఆరు యూనిట్లలో నూరు శాతం సభ్యత్వం పూర్తి చేయాలని సూచించారు.