బస్ భవన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

HYD: 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్రం సిద్ధించడానికి ఎంతో మంది వీరోచిత పోరాటం చేశారని, వారి ఆశయాలను కొనసాగించాలన్నారు.