నిజాం కళాశాల విద్యార్థుల ఆందోళన.. ఉద్రిక్తత
HYD: నిజాం కళాశాల హాస్టల్ తెరిపించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బషీర్‌బాగ్‌లోని రహదారిపై విద్యార్థులు బైఠాయించారు. వసతి గృహం ఫీజు కట్టినా, గత 20 రోజులుగా హాస్టల్ మూసివేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే హాస్టల్ తెరిపించాలంటూ నిరసన చేపట్టారు. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడగా, పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు.