కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి
NGKL: కోడేరు మండల కేంద్రానికి చెందిన వెంకటయ్య(43) తన నిర్మాణంలో ఉన్న ఇంటి పిల్లర్లకు నీళ్ళు పట్టడానికి మోటారుకు విద్యుత్ కనెక్షన్ ప్లగ్ పెడుతుండగా, ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య బాలీశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హెడ్ కానిస్టేబుల్ బద్రియా నాయక్ తెలిపారు. మృతుడికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు.