ఫోక్సో కేసు.. ఇద్దరు నిందితులు అరెస్ట్

ఫోక్సో కేసు.. ఇద్దరు నిందితులు అరెస్ట్

SKLM: బాలికపై లైంగిక దాడి కేసులో ఫోక్సో చట్టం కింద ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జే.ఆర్.పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పిశిని గ్రామానికి చెందిన మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌నకు తరలించినట్లు శ్రీకాకుళం సబ్ డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన పత్రిక సమావేశంలో కేసు వివరాలను డీఎస్పీ సి.హెచ్ వివేకానంద తెలియజేశారు.