రోషన్ 'ఛాంపియన్'పై బిగ్ UPDATE
టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ నటిస్తోన్న సినిమా 'ఛాంపియన్'. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. రేపు ఉదయం 11:17 గంటలకు దీని టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే దీన్ని 'బాహుబలి: ది ఎపిక్' మూవీ థియేటర్లలో జత చేయనున్నట్లు వెల్లడించారు. ఇక ప్రదీప్ అద్వైత్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా DEC 25న విడుదలవుతుంది.