కోతులకు ఆహార అందించిన వాహనదారునికి జరిమానా

MNCL: భీమారం మండల కేంద్రంలోని అటవీ ప్రాంతంలోని రహదారి పక్కన ఉన్న కోతులకు ఆహారం అందించిన వాహనదారునికి ఫారెస్ట్ అధికారులు మూడు వేల రూపాయల జరిమానాను విధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అడవిలో ఉన్న కోతులకు ఆహారం అందించడం వల్ల అవి వాటి స్వభావాన్ని కోల్పోయి రోడ్ల పైకి రావడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని అధికారులు తెలిపారు.