అలరించిన కళాకారుల ప్రదర్శన
AKP: శ్రీరామనవమి సందర్భంగా పాయకరావుపేట మండలం పెంటకోట చినవాడపేటలో తప్పెటగుళ్ళు కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమం అలరించింది. ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో సాంప్రదాయపద్ధంగా నిర్వహించారు. అనంతరం కళాకారులు జానపదాలు పాడుతూ సాంస్కృతిక ప్రదర్శన ఇచ్చారు.