'రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి'
AKP: మునగపాక మండలం పాటిపల్లిలో శిథిలావస్థకు చేరిన రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ కృష్ణవేణి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ విజయ కృష్ణన్‌కు వినతి పత్రం అందజేశారు. స్థానిక చెరువు నుంచి 300 మీటర్ల రహదారి గోతులమయంగా ఉందన్నారు. దీనివల్ల రాకపోకులకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు పేర్కొన్నారు.