దారాలమ్మ తల్లి హుండీ ఆదాయం ఎంతంటే..?

ASR: జీకే వీధి మండలం దారకొండ ఘాటీరోడ్డులో వేంచేసియున్న శ్రీ దారాలమ్మ తల్లి హుండీ లెక్కింపు మంగళవారం ఈవో సాంబ శివరావు ఆధ్వర్యంలో చేపట్టారు. అమ్మవారి జాతర అనంతరం హుండీ లెక్కించారు. రూ.4,39,313 భక్తులు అమ్మవారికి కానుకలుగా సంమర్పించినట్టు ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ అధికారులు టీడీపీ నాయకులు స్థానిక భక్తులు పాల్గొన్నారు.