ఈనెల 5న చిన్నమండెంలో సర్వసభ్య సమావేశం

అన్నమయ్య: చిన్నమండెం మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మే 5న ఉదయం 10:30 గంటలకు ఎంపీపీ సుధా మాధురి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో శేఖర్ నాయక్ తెలిపారు. ఈ సమావేశానికి మండలంలోని స్థానిక ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పిటిసి సభ్యులు తప్పక హాజరుకావాలని సూచించారు.