ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి మార్చ్ ఫాస్ట్
SRPT: మూడవ విడతలో ఎన్నికలు జరిగే మఠంపల్లి మండలంలోని బక్కమంతుల గూడెం గ్రామంలో సోమవారం హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు, మఠంపల్లి ఎస్సై పి.బాబు ఆధ్వర్యంలో మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. గ్రామంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు గ్రామ ప్రజలు సహకరించాలన్నారు. ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.