VIDEO: వైభవంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు

ప్రకాశం: కనిగిరిలోని శ్రీ దొంతులమ్మ ఆలయంలో కొలువైన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన ఉత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పండితులు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు పూజలు చేశారు. ఉత్సవాలు ఈ నెల 11వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు.