ఓయూలో NSUI ఆవిర్భావ దినోత్సవం

HYD: ఉస్మానియా యూనివర్సిటీలో NSUI 53వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. NSUI ఓయూ అధ్యక్షుడు శ్రీను జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. NSUI ఆవిర్భవించినప్పటి నుంచి విద్యార్థుల పక్షాన నిలబడి ఎన్నో ఉద్యమాలు చేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో NSUI నాయకులు పాల్గొన్నారు.