ఎరువులు పంపిణీ చేయాలని 26న ర్యాలీ

AKP: రైతులకు అవసరమైన ఎరువులు పంపిణీలో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ ఆరోపించారు. మునగపాకలో ఆయన శుక్రవారం మాట్లాడారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి అవసరమైన ఎరువులు పంపిణీ చేయకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న మునగపాకలో ర్యాలీ నిర్వహిస్తామన్నారు.