చెరువులో పడి ఇద్దరు మృతి
CTR: గుడిపల్లి మండలం కనుమనపల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. చెరువులో దుస్తులు ఉతికేందుకు వెళ్లిన బేబీ (19), దుర్గ (21) ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. వరుసకు అక్కాచెల్లెళ్లయిన వీరిద్దరూ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. అయితే, ఈ ఘటనపై తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు తెలిపారు.