VIDEO: ‘రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి’

VIDEO: ‘రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి’

ప్రకాశం: రాచర్ల మండలంలోని జేపీ చెరువు గ్రామ సమీపంలో వెలసిన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 2 నుంచి 5 వరకు ఎంతో ఘనంగా నిర్వహించనున్నారని గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఇవాళ తెలిపారు. ఏప్రిల్ 2న అంకురార్పణ, 3న స్వామివారి కళ్యాణం, 4న తెప్పోత్సవం, 5న చక్ర స్నానం జరుగుతాయన్నారు. ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు.