కాలువలోకి దూసుకెళ్లిన టెంపో.. 15 మందికి గాయాలు
WG: తాడేపల్లిగూడెం మండలం చినతాడేపల్లి వద్ద జాతీయ రహదారిపై యాత్రికుల టెంపో పంట బోదెలోకి దూసుకెళ్లింది. జార్ఖండ్ నుంచి చెన్నై వెళ్తున్న ఈ వాహనంలో 27 మంది ఉన్నట్లు సమాచారం. వారిలో 15 మందికి స్వల్ప గాయాలు కావడంతో ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో 11 మంది సురక్షితంగా బయటపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.