నీట్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ

MBNR: నీట్ పరీక్షల సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ, ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటును జిల్లా ఎస్పీ జానకి స్వయంగా ఆదివారం పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.