ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

కడప నగరంలోని అలంకాన్‌పల్లె సమీపంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శుక్రవారం ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి కుడి చేతిపై 'కృష్ణవేణి' అని పచ్చబొట్టు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని ఆచూకీ తెలిసిన వారు కడప తాలూకా సీఐను సంప్రదించాలని, సమాచారం కోసం 91211 00514, 91211 00516 నంబర్లకు కాల్ చేయాలని పోలీసులు సూచించారు.