RTC సిబ్బందికి ప్రోత్సాహకాలు

RTC సిబ్బందికి ప్రోత్సాహకాలు

CTR: ఇంధన పొదుపుతో RTCకి ఆదాయం వస్తుందని పుంగనూరు ఆర్టీసీ డిపో మేనేజర్ దినేశ్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఇంధనం పొదుపు చేసిన డ్రైవర్లు జాబీర్, కే. నాగరాజా, కండక్టర్ అబూబకర్, భార్గవి, జీలాని బాషాకు చెక్కు రూపంలో ప్రోత్సాహక బహుమతులను ఆయన డిపోలో అందజేశారు. ఇదే విధంగా ఆర్టీసీ ప్రగతికి కృషి చేయాలని కోరారు.