రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ఎన్టీఆర్: ఒక వ్యక్తి టీవీఎస్ మోపెడ్‌పై తన భార్యను ఎక్కించుకొని వెళుతుండగా లారీ ఢీ కొట్టడంతో అతని భార్య (50 )మృతి చెందింది. భర్తకు స్వల్ప గాయాలైన ఘటన ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం గణపవరం గ్రామ సమీపంలో ఆర్అండ్‌బీ రహదారిలో గురువారం చోటుచేసుకుంది. భార్య భర్తలు జి. కొండూరు గ్రామాని కి చెందిన వారుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.