నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్
WNP: గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులు కావాల్సిన ధ్రువపత్రాలు అన్ని ఇచ్చారో లేదో సక్రమంగా చూసుకోవాలని రిటర్నింగ్ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. బుధవారం పెబ్బేరు మండలంలోని నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలన్నారు.