VIDEO: బాలానగర్‌లో సర్పంచ్ ఎన్నికల ప్రచారం
MBNR: బాలానగర్ మండలంలో ఈ నెల 17న జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది. దీంతో అభ్యర్థులు ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు. తిరుమలగిరి గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి అన్నే బసవరాజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తనను సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చి ఓటర్లను అభ్యర్థించారు.