'బాల్య వివాహాలను అరికడదాం'
JGL: గ్రామాల్లో బాల్య వివాహాలను అరికడదామని, జిల్లా బాలల రక్షణ అధికారి శ్రీనివాస్ అన్నారు. కథలాపూర్ మండలం దుంపేట, పోసానిపేట, చింతకుంట గ్రామాల్లో బాలికల రక్షణ-బాల్య వివాహాల నివారణ కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ హైమది బేగం, అధికారులు చంద్ర శేఖర్ పాల్గొన్నారు.