VIDEO: సదరం క్యాంపులో అసౌకర్యాలతో వృద్ధుల ఇబ్బందులు
KRNL: ఆదోనిలో ఉన్న జనరల్ హాస్పిటల్లో ప్రజల బాధలు వర్ణాతీతం. సదరం క్యాంపునకు వచ్చిన దివ్యాంగులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకవైపు సాంకేతిక లోపాలతో ఇబ్బందులు పడుతూ మరోపక్క నేలపై కూర్చొని పనులను ముగించుకుని వెళ్లారు. 250 పడకల హాస్పిటల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో అధికారులపై అసహనం వ్యక్తం చేశారు.