ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు

ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు

VZM: పార్టీలు మారడం, ప్రోత్సహించడం బొబ్బిలి రాజులకు వెన్నతో పెట్టిన విద్య అని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. బొబ్బిలిలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. బొబ్బిలిలో రాజులు ప్రవేశించిన తర్వాత నికరం లేని రాజకీయాలు చేయడం, గందరగోళ పరిస్థితులు సృష్టించడం పరిపాటిగా మారిందన్నారు. ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారన్నారు.