తుఫాన్ ఎఫెక్ట్.. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు

తుఫాన్ ఎఫెక్ట్.. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు

BPT: దిత్వా తుపాను ప్రభావంతో వాడరేవు, రామాపురం సముద్ర తీరాల్లో అలలు ఎగసిపడుతున్నాయి. వాడరేవు తీరంలో 4 అడుగుల మేర ముందుకు సముద్రం చొచ్చుకొచ్చింది. వాడరేవు, రామాపురం, కటారివారిపాలెం, పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్‌లు మూసివేసినట్లు అధికారులు తెలిపారు. సముద్ర తీరాలకు వెళ్లే మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి తీరం వద్దకు ఎవరూ రాకుండా పోలీసులు గస్తీ కాస్తున్నారు.