జగదేవపూర్ బస్టాండ్‌లో సౌకర్యాలు కరువు..!
SDPT: జగదేవపూర్ ఆర్టీసీ బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. మండల కేంద్రంలో ప్రయాణికుల రవాణా సౌకర్యార్థం మూడు సంవత్సరాల కిందట కొత్త బస్టాండ్ నిర్మించారు. ఈ బస్టాండ్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్‌లో ఉన్న వ్యక్తిగత మరుగుదొడ్లు మూత్రశాలలు నిరుపయోగంగా మారాయి. దీంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారు.