VIDEO: నీటి సమస్యపై రోడ్డెక్కిన మహిళలు

సత్యసాయి: మడకశిర పట్టణంలోని 4, 7వ వార్డుల మహిళలు గత రెండు నెలలుగా తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని శుక్రవారం రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. వాహనాలను గంటసేపు అడ్డుకుని నినాదాలు చేసిన వారు సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించాలన్నారు.