మహిళా యూనివర్సిటీ విద్యార్థినికి అరుదైన అవకాశం

మహిళా యూనివర్సిటీ విద్యార్థినికి అరుదైన అవకాశం

తిరుపతి: శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ B.Tech విద్యార్థినికి అరుదైన అవకాశం లభించింది. చివరి సంవత్సరం CSE చదువుతున్న చంద్రిక గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్‌గా ఎంపికైనట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. గూగుల్ టెక్నాలజీపై స్వల్పకాలిక అవగాహన, శిక్షణా కార్యక్రమాల నిర్వహణకు ఆమెకు ఈ అవకాశం లభించింది. ఈ మేరకు ఆమెను VC ఉమ, రిజిస్ట్రార్ రజిని అభినందించారు.