పెంచిన టెట్ దరఖాస్తు ఫీజును తగ్గించాలని డిమాండ్

రామగుండం: పెంచిన టెట్ దరఖాస్తు ఫీజును రూ.2 వేల నుంచి రూ.200 లకు వెంటనే తగ్గించి నిరుద్యోగులకు ఉపశమనం కలిగించాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ ఆదివారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో కోరారు. ఫీజు తగ్గించిన తర్వాతనే దరఖాస్తులను తీసుకోవాలని, 33జిల్లాల్లో టెట్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.