హెల్త్ క్లినిక్‌లకు ఎమ్మెల్యే భూమి పూజ

హెల్త్ క్లినిక్‌లకు ఎమ్మెల్యే భూమి పూజ

కోనసీమ: అమలాపురం రూరల్ మండలం బండారులంక గ్రామంలో రెండు విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సోమవారం శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం చేరువ చేయడమే ఎన్డీయే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. అత్యాధునిక వసతులతో ఈ క్లినిక్‌ లు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయన్నారు.