VIDEO: కాంగ్రెస్ పాలనపై మాజీ ఎమ్మెల్యే విమర్శలు
HNK: పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు చేశారు. ఈ మేరకు సోమవారం పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పనులు మాటాలకే పరిమితం, చేసేది శూన్యం అని, సంక్షేమ పథకాలు గల్లంతయ్యాయని, పెన్షన్లు, రైతుబంధు లబ్ధిదారులను మోసం చేశారని ఆరోపించారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.