జిల్లాలో యుద్ధ వ్యతిరేక ర్యాలీ..!
GDWL:ప్రపంచ వినాశనానికి దారితీసే యుద్ధాలను ఆపి, శాంతి స్థాపనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి" అని గద్వాల అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు యుద్ధ వ్యతిరేక శాంతి ర్యాలీ నిర్వహించారు. వెంకట్రాములు మాట్లాడుతూ.. యుద్ధాల వల్ల ఆర్థిక, సామాజిక వ్యవస్థలు కుప్పకూలి ఆకలి, పేదరికం పెరుగుతాయి అన్నారు.