VIDEO: కూతురితో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్
TPT: ప్రముఖ సినీనటి శ్రీయ శరన్ కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ సుప్రభాత సేవలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆమెకు వైకుంఠం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల పలువురు అభిమానులు ఫొటోలు దిగారు.