ఈ నెల 14న జిల్లా సమీక్ష సమావేశం

VZM: ఈనెల 14న జిల్లా సమీక్ష సమావేశం జరుగుతుందని కలెక్టర్ అంబేడ్కర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొంటారని చెప్పారు. ఈ సమావేశంలో నీటిపారుదల, వ్యవసాయ తదితర అంశాలను చర్చించి, తగు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు.