'వయోవృద్ధుల హక్కులను కాపాడాలి'
WNP: వయోవృద్ధుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా శిశు సంక్షేమ, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ అధికారి సుధారాణి తెలిపారు. వయోవృద్ధుల వారోత్సవాలలో భాగంగా ఈనెల 19న జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వయోవృద్ధుల దినోత్సవం నిర్వహించబడనుందని తెలిపారు. వృద్ధులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు.