'వాహనాలకు వారం రోజుల్లో జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు'

'వాహనాలకు వారం రోజుల్లో జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు'

GNTR: పారిశుద్ధ్య, ఇంజినీరింగ్ వాహనాలన్నింటికీ వారం రోజుల్లోగా జీపీఎస్ ట్రాకర్‌ను ఏర్పాటు చేయాలని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. ఈ ట్రాకర్‌ను కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం పెద్ద పలకలూరు, ఉద్యోగనగర్, ఇన్నర్ రింగ్ రోడ్, అరండల్ పేట ప్రాంతాలలో పారిశుధ్య పనులు పరిశీలించారు.