ప్రొద్దుటూరులో నర్సు మిస్సింగ్.. కేసు నమోదు

ప్రొద్దుటూరులో నర్సు మిస్సింగ్.. కేసు నమోదు

కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని హోలిస్టిక్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తున్న ఒక వివాహిత మహిళ అదృశ్యం కావడం స్థానికంగా సంచలనంగా మారింది. నిన్న రాత్రి భర్త ఆమెను నైట్ డ్యూటీకి వదిలి వెళ్లగా, ఉదయం నుంచి ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే హాస్పిటల్ సీసీ కెమెరా ఫుటేజ్‌లో ఉదయం 7 తర్వాత ఆమె కనిపించలేదు, దీంతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.