మానవత్వం చాటుకున్న కలెక్టర్

CTR: యాదమరి(M) ముస్లింవాడలోని కండ్రిగకు చెందిన ఇంతియాజ్ పుట్టుకతోనే మూగవాడు. ఇటీవల రాయి పనికి వెళ్లగా.. అక్కడ జరిగిన బ్లాస్టింగ్‌లో రెండు కళ్లు, కుడిచేయి మణికట్టు వరకు కోల్పోయాడు. కలెక్టరేట్లో నిన్న జరిగిన గ్రీవెన్స్ డేకు బాధిత కుటుంబం హాజరై కలెక్టర్ సుమిత్ కుమార్‌కు సమస్యను వివరించారు. ఆయన మానవతా థృక్పథంతో PSR ఫండ్స్ నుంచి కుటుంబానికి రూ.లక్ష అందజేశారు.