వేల సంఖ్యలో బాంబు బెదిరింపులు.. నిందితుడి అరెస్ట్
కొంతకాలంగా పలు సూళ్లు, ఆఫీసులు, కోర్టులకు బాంబు బెదిరింపులు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇలా బెదిరింపు మెయిల్స్ పంపిస్తున్న నిందితుడు శ్రీనివాస్ అనే వ్యక్తిని మైసూరులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను మొత్తం 1100 సార్లు నకిలీ బెదిరింపులు పంపినట్లు అధికారులు తెలిపారు. అతని వద్ద ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతడిని ఢిల్లీకి తరలించారు.