రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
KMR: గాంధారి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గాంధారి ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం... నరసాపూర్ గ్రామానికి చెందిన లింగయ్య బాన్సువాడ నుంచి బైక్‌పై స్వగ్రామానికి వెళ్తున్నారు. నరసాపూర్ గ్రామ శివారులో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్‌ను గమనించకుండా ద్విచక్ర వాహనంతో ఢీకొట్టారు. ఈ ఘటనలో లింగయ్య అక్కడికక్కడే మృతి చెందారు.