దాత సహకారంతో పాఠశాలకు వైట్ వాష్
PDPL: ముత్తారం మండలం పోతారం ప్రాథమిక పాఠశాలకు చిలకల జితేందర్ అనే దాత వైట్ వాష్ వేయించాడని హెచ్ఎం సత్తయ్య తెలిపారు. నాలుగు తరగతి గదులు, టాయిలెట్స్‌కు వైట్ వాష్ వేయించిన అతనికి HM, సర్పంచ్ చరణ్, ఎఎపిసి చైర్ పర్సన్ పద్మ, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి దాతలు సహకరించాలని ఈ సందర్భంగా హెచ్ఎం కోరారు.