మార్కండేయ ఆలయంలో చోరికి పాల్పడ్డ దుండగులు

MHBD: జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ ఆలయంలో గుర్తు తెలియని దుండగులు చోరికి పాల్పడ్డారు. దుండగులు ఆలయంలోని హండిని పగలకొట్టి అందులో నుంచి సుమారు 1.50 లక్షలు దోచుకున్నట్లు ఆలయ అర్చకులు తెలుపుతున్నారు. ఆలయంలోని పలు వస్తువులను ధ్వంసం చేసినట్లు వారు తెలిపారు.