VIDEO: బాసర ఆలయంలో కార్తీకమాసం సందడి
NRML: కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో బాసరలో సందడి నెలకొంది. భక్తులు పెద్దఎత్తున ఆలయానికి తరలివస్తున్నారు. పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి నదిలో కార్తీక దీపాలు వదిలి మొక్కులు తీర్చుకుంటున్నారు. అనంతరం సరస్వతి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.