ప్రభుత్వానికి రైతులపై ప్రేమ లేదా?

NLR: ఇండో సోల్ పరిశ్రమపై ప్రభుత్వానికి ఉన్న ప్రేమ కరేడు రైతులపై లేకపోవడం బాధాకరమని రైతు ఉద్యమ నాయకుడు, 139 బీసీ కులాల జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ మిరియం శ్రీనివాసులు అన్నారు. రైతుల మనో ధైర్యాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం కుటీల ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. ఈనెల 16వ తేదీ గ్రామ సభ ఏ విధంగా నిర్వహిస్తారని ప్రశ్నించారు. రైతులకు అన్యాయం జరిగితే పోరాటలు చేస్తామని తెలిపారు.