' ఆన్‌లైన్ బెట్టింగ్‌కు దూరంగా ఉండాలి'

VZM: రాజాంలోని ఓ ప్రైవేట్ కాలేజీలోని సంకల్పం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలపై సీఐ అశోక్ కుమార్ అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలు, ఆన్‌లైన్ బెట్టింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. వాటి వల్ల కుటుంబాలు ఆర్థికంగా, శారీరకంగా నష్టపోతారని తెలియజేశారు. విద్యార్థులు మంచిగా చదువుకుని ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.